అడవులు వన్యమృగ సంరక్షణ కేంద్రాలు*
■పర్యావరణ సమతుల్యం సాధించే 33 శాతం అడవులు విస్తరించి ఉండాలని ఈ అటవీ విధానం ఏ సంవత్సరం లో పేర్కొన్నారు ?
*జ: 1952*
■ రిజర్వ్ ఫారెస్ట్ లక్షణాలు ?
* పూర్తిగా ప్రభుత్వ పరిరక్షణలో ఉండటం
* ప్రజలు అడవిలోకి ప్రవేశించడంపై నిషేధం
* మేత కోసం పశువులను వదలకూడదు
■ దేశంలో అడవులు పరిపాలన సౌలభ్యం కోసం ఏ విధంగా విభజించారు
* రక్షిత అడవులు
* రిజర్వు అడవులు
* కేటాయించని అడవులు
■ ప్రపంచంలోని మొత్తం అడువులలో దేశంలో విస్తరించి ఉన్న అడవులు ఎంత శాతం ఆక్రమించాయి
*జ: సుమారు 1.85%*
■ అత్యదికంగా అడవులు ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం ?
*జ: అండమాన్ నికోబార్ దీవులు*
■ అత్యల్ప శాతం అడవులు ఉన్న రాష్ట్రం ?
*జ: హర్యానా*
■ ఉష్ణమండల ఆకురాల్చు అడవులు ఏమని పిలుస్తారు ?
*జ: రుతుపవన అడవులు*
■ దేశంలో అత్యధిక ప్రాంతంలో విస్తరించి ఉన్న అడవులు ఏవి ?
*జ: ఆకురాల్చే అడవులు*
■ శ్వాస వేర్లు బయట ఉండటం ఈ అడవుల్లో పెరిగే చెట్లలలో కనిపిస్తుంది ?
*జ: టైడల్ అడవులు*
■ సుందరి అనే చెట్లు ఏ అడవుల ప్రత్యేకత ?
*జ: మడ/టైడల్ అడవులు*
■ దేశంలో విస్తరించి ఉన్న అడవులలో మెత్తని కలపని నిచ్చే చెట్లు పెరిగి అడవులు ఏవి ?
*జ: శృంగాకార అడవులు*
■ దేశంలో అటవీ పరిశోధన కేంద్రం ఉన్న ప్రాంతం ఏది ?
*జ: డెహ్రాడున్*
■ పులులను సంరక్షించడానికి దేశంలో ఏ సంవత్సరంలో ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభించారు
*జ: 1973*
■ మొసళ్ల సంరక్షణకోసం క్రోకడైల్ బ్యాంకును ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు ?
*జ: చెన్నై*
■ దేశంలో ఏ ప్రాంతంలో మొట్టమొదటిసారి బయోస్పియర్ కేంద్రంగా ప్రకటించారు ?
*జ: నీలగిరి - తమిళనాడు-1986*
■ ప్రపంచ ప్రసిద్ధి చెందిన మంచిగంధం ఏ రాష్ట్రంలో పెరిగే అడవుల్లో అధికంగా ఉంది ?
*జ: కర్ణాటక*
■ దేశంలో ప్రతి సంవత్సరం వనమహోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు ?
*జ: జూలై మొదటి వారం*
■ అడవుల సంరక్షణ చట్టాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు ?
*జ: 1980*
■ దేశంలో మొదట గా ఏర్పాటు చేసిన జాతీయ పార్కు ?
*జ: జిమ్ కార్బెట్*
■ రాజస్థాన్ లోని సరిస్కా జాతీయ పార్కు దేనికి ప్రసిద్ధి చెందింది ?
*జ: పులులు*
■ ఖడ్గమగాలకు ప్రసిద్ధిచెందిన కాజీరంగా జాతీయ పార్కు రాష్ట్రంలో ఉంది ?
*జ: అసోం*
■ దాచిగామ్ శాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉంది ?
*జ: జమ్మూకాశ్మీర్*
■ గుజరాత్ లోని గిర్ అడవులు ఏ జంతువులకు ప్రసిద్ధి చెందింది ?
*జ: సింహాలు*
No comments:
Post a Comment